Telangana: రేపు సిరిసిల్లలో పర్యటించనున్న సీఎం కేసీఆర్

  • కాసేపట్లో హైదరాబాద్ నుంచి బయలుదేరనున్న కేసీఆర్
  • ఈరోజు రాత్రికి కరీంనగర్ లో బస
  • రేపు మిడ్ మానేరు ప్రాజెక్టును పరిశీలించనున్న సీఎం
తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. కొంచెం సేపట్లో హైదరాబాద్ నుంచి బయలు దేరి కరీంనగర్ కు కేసీఆర్ వెళ్లనున్నారు. ఈరోజు రాత్రికి కరీంనగర్ లో కేసీఆర్ బస చేయనున్నారు. రేపు ఉదయం వేములవాడ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్ లో వెళ్లి రాజరాజేశ్వర మిడ్ మానేరు ప్రాజెక్టును పరిశీలించనున్నారు. ఏరియల్ సర్వే అనంతరం ప్రాజెక్టు పనులపై సమీక్షించనున్నారు. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Telangana
cm
kcr
Vemulavada
Midmaneru

More Telugu News