Siddha Reddy: అనంతపురంలో అసెంబ్లీని పెట్టాలని వైసీపీ ఎమ్మెల్యే డిమాండ్!

  • మూడు రాజధానులతో రాష్ట్రాభివృద్ధి జరుగుతుందన్న సిద్ధారెడ్డి
  • అసెంబ్లీ నిర్మించి, శీతాకాల సమావేశాలు అనంతలో నిర్వహించాలి
  • వివిధ శాఖల కార్యాలయాలను జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయాలన్న కదిరి ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు ఏర్పాటు అయితే, అన్ని ప్రాంతాలూ అభివృద్ధి పథంలో దూసుకెళతాయని అభిప్రాయపడ్డ కదిరి ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పీవీ సిద్దారెడ్డి, అనంతపురంలో అసెంబ్లీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన, ఒక్క అమరావతిని లక్ష కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసే బదులు, మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేయవచ్చని తెలిపారు. ఇక్కడ అసెంబ్లీని పెట్టి, శీతాకాల సమావేశాలు నిర్వహిస్తే బాగుంటుందని సిద్దారెడ్డి అభిప్రాయపడ్డారు. వివిధ శాఖల అధిపతుల కార్యాలయాలను కూడా జిల్లాల స్థాయిలో ఏర్పాటు చేయాలని సూచించారు.
Siddha Reddy
Kadiri
MLAS
YSRCP
Anantapur District

More Telugu News