Capital: రాజధానికి విశాఖ అనుకూలం : మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు

  • ఇది నా వ్యక్తిగత అభిప్రాయం 
  • రివర్స్ టెండరింగ్ లో మిగిలిన వెయ్యికోట్లతో నిర్మాణాలు పూర్తి చేయొచ్చు
  • స్పష్టమైన ప్రకటనకు సమయం పట్టొచ్చు

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అలరారేందుకు అన్ని అర్హతలు ఉన్న నగరం విశాఖ అని బీజేపీ మాజీ ఫ్లోర్ లీడర్, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు అన్నారు. తమ పార్టీ వైఖరి ఏదైనా ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అని అన్నారు. విశాఖపట్నం రాజధాని కావడం వల్ల నిర్మాణ వ్యయం చాలావరకు ఆదా అవుతుందన్నారు.

రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి మిగిలిన వెయ్యి కోట్ల రూపాయలతో పనులు పూర్తి చేసుకోవచ్చని చెప్పారు. మూడు రాజధానులపై ప్రకటన చేసిన అనంతరం ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి మౌనం వహిచండం వెనుక రాజకీయ కారణాలు ఉండవచ్చునన్నారు.

ముఖ్యంగా మూడు ప్రాంతాల మధ్య ఎటువంటి విభేదాలు రాకుండా ఉండేందుకే ఆయన మౌనం వహించి ఉంటారని అభిప్రాయపడ్డారు. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక వచ్చే వరకు జగన్ మౌనాన్నే ఆశ్రయించే అవకాశం ఉందన్నారు. ఈ నివేదిక వచ్చేసరికి కొంత సమయం పట్టవచ్చని తెలిపారు.

More Telugu News