Robert Vadra: నా భార్యను నెట్టేశారు.. కిందపడిపోయింది: ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా

  • అయినప్పటికీ ప్రజల వద్దకు వెళ్లాలనే ఆమె నిర్ణయించుకుంది 
  • ఆమె ద్విచక్ర వాహనంపై ప్రయాణించింది 
  • నా భార్యను చూసి గర్వపడుతున్నాను
ఉత్తర్ ప్రదేశ్ పోలీసులపై కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నిన్న పోలీసులు తనపై చేయి చేసుకున్నారని ఆమె ఆరోపించారు. దీనిపై ఆమె భర్త రాబర్ట్ వాద్రా స్పందించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... మహిళా పోలీసులు ఆమెపై చేయి చేసుకున్న తీరు పట్ల నేను బాధపడ్డాను. ఒక మహిళా పోలీసు ప్రియాంకా గాంధీ గొంతును పట్టుకున్నారు. మరొకరు ఆమెను నెట్టేయడంతో ఆమె కిందపడింది' అని తెలిపారు.

'అయినప్పటికీ ప్రజల వద్దకు వెళ్లాలనే ఆమె నిర్ణయించుకుంది. మాజీ ఐపీఎస్ అధికారి ఎస్ఆర్ దరపురీ కుటుంబ సభ్యులను కలవడానికి ఆమె ద్విచక్ర వాహనంపై ప్రయాణించింది.  ప్రజల పట్ల ప్రియాంకా గాంధీ చూపుతోన్న ప్రేమ, తన అవసరం ఉన్న చోటుకి ఆమె వెళ్తున్న తీరు పట్ల నేను గర్వపడుతున్నాను. ఆమె చేసిన పని సరైందే. కష్టాల్లో ఉన్న ప్రజల వద్దకు వెళ్లడం నేరంకాదు.

Robert Vadra
robert vadra
Police

More Telugu News