Mahesh Babu: గంటల వ్యవధిలో 12 లక్షల వ్యూస్... 'సరిలేరు నీకెవ్వరు' తమన్నా స్పెషల్ సాంగ్!

  • మహేశ్ హీరోగా చిత్రం
  • పాటలో సందడి చేయనున్న తమన్నా
  • దూసుకెళుతున్న సాంగ్ టీజర్

మహేశ్ బాబు హీరోగా, విజయశాంతి ప్రధాన పాత్రలో నటిస్తుండగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కి విడుదలకు సిద్ధమైన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలోని ఓ స్పెషల్ సాంగ్ లో తమన్నా సందడి చేయనుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్ జోరుగా సాగుతుండగా, తాజాగా 'డాంగ్ డాంగ్...'  అంటూ సాగే తమన్నా స్పెషల్ సాంగ్ టీజర్ విడుదలై కుర్రకారును ఓ ఊపు ఊపేస్తోంది. యూట్యూబ్ లో ట్రెండింగ్ లోకి ఈ టీజర్ వెళ్లగా, గంటల వ్యవధిలో 12 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. 'హలో... ఆజ్ రాత్ మేరే ఘర్ మే పార్టీ హై. తూ ఆజానా...' అంటూ సాగే ఈ పాట టీజర్ ను మీరూ చూడండి.

More Telugu News