Hyderabad: మద్యం తాగి కారులో దూసుకుపోయిన యువకులు.. ఎర్రగడ్డ బ్రిడ్జిపై కారు బోల్తా!

  • ఫుల్లుగా తాగి కారు నడిపిన యువకులు
  • బ్రిడ్జిపై అదుపు తప్పి బోల్తా
  • ముగ్గురు యువకులకు గాయాలు
హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ వంతెనపై ఓ కారు బోల్తా పడింది. గత రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారును తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మద్యం తాగి వేగంగా కారు నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం రాత్రివేళ జరగడంతో పెను ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు.
Hyderabad
Erragadda bridge
car accident

More Telugu News