Tirumala: వైకుంఠ ద్వారాలు 10 రోజులు తెరిచే ప్రసక్తే లేదు: స్పష్టం చేసిన టీటీడీ

  • గతంలో లేని సంప్రదాయం ఇప్పుడెందుకని అభ్యంతరాలు
  • ఏకాదశి, ద్వాదశి రోజుల్లోనే వైకుంఠ దర్శనం
  • గొల్లమండపాన్ని మార్చే ప్రసక్తే లేదని స్పష్టీకరణ

తొలుత వార్తలు వచ్చినట్టుగా ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలను తెరిచే ప్రసక్తే లేదని తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి తేల్చి చెప్పింది. ఏకాదశి, ద్వాదశి రోజుల్లో మాత్రమే వైకుంఠ ద్వారాన్ని తెరవాలని నిర్ణయించింది.

భక్తుల సౌకర్యార్థంతో పాటు, రద్దీని దృష్టిలో ఉంచుకుని, 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాల నుంచి భక్తులను అనుమతించే అవకాశాలపై చర్చించామని, అయితే, గతంలో లేని సంప్రదాయాన్ని ఇప్పుడు ప్రారంభించడం ఎందుకన్న అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని అధికారులు తెలిపారు. దీంతో ఆ రెండు రోజుల్లో మాత్రమే సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇచ్చి, వైకుంఠ దర్శనం చేయిస్తామని అన్నారు.

సంక్రాంతిలోపు తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధ, దిశగా కార్యాచరణ ప్రారంభిస్తామని, గొల్లమండపాన్ని ఇప్పుడున్న స్థానం నుంచి మార్చే ఆలోచనేదీ లేదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.

  • Loading...

More Telugu News