Mary Kom: వివాదం రేకెత్తించిందే ఆమె... నేనెందుకు గౌరవించాలి?: నిఖత్ జరీన్ కు మేరీ కోమ్ కౌంటర్

  • నిఖత్ జరీన్ పై నిప్పులు చెరిగిన మేరీ కోమ్
  • నోరు పారేసుకోవద్దంటూ వార్నింగ్
  • దమ్ముంటే గెలిచి మాట్లాడాలని సవాల్

భారత్ లో ఇద్దరు అగ్రశ్రేణి బాక్సర్ల మధ్య వివాదం ఇప్పటికీ చల్లారలేదు. ఒలింపిక్ బెర్తుపై ఏర్పడిన వివాదంలో స్టార్ బాక్సర్ మేరీ కోమ్, జూనియర్ నిఖత్ జరీన్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా, ఇరువురి మధ్య ఒలింపిక్ క్వాలిఫయర్స్ ట్రయల్ బౌట్ నిర్వహించగా, మేరీ కోమ్ అద్భుత విజయం సాధించింది. అయితే బౌట్ తర్వాత గౌరవభావంతో ఆమెను హత్తుకునేందుకు ప్రయత్నిస్తే మేరీ కోమ్ అందుకు నిరాకరించిందని నిఖత్ జరీన్ సంచలన ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణలకు మేరీ కోమ్ దీటుగా బదులిచ్చింది.

"ఆమె నా విశ్వసనీయతను, ఘనతలను ప్రశ్నించింది. నన్ను అనవసర వివాదంలోకి లాగిందే ఆమె. అవును, ఆమెను నేను హత్తుకోలేదు, అయితే ఏంటి? ఈ గొడవంతటికీ కారణం ఆమే. నేను కూడా మానవమాత్రురాలినే. నాకూ స్పందనలుంటాయి. నా విజయాలను ప్రశ్నించే వాళ్లతో ఇంతకంటే ఎలా ప్రవర్తించాలి? దమ్ముంటే ప్రతిభ చూపించు, నా స్థానాన్ని నువ్వు ఆక్రమించు. ఎవరు ఆపారు నిన్ను? బౌట్ లో నెగ్గకుండా పెద్ద పెద్ద మాటలు మాట్లాడొద్దు. నువ్వు నోరు పారేసుకుంటే నేను అలాగే స్పందిస్తా" అంటూ మేరీ కోమ్ తీవ్ర ఆగ్రహావేశాలు ప్రదర్శించింది.

  • Loading...

More Telugu News