Boxing: బౌట్ తర్వాత హత్తుకునేందుకు ప్రయత్నిస్తే మేరీ కోమ్ నిరాకరించింది: నిఖత్ జరీన్

  • మేరీ కోమ్, నిఖత్ జరీన్ మధ్య ట్రయల్ బౌట్
  • ఓటమిపాలైన నిఖత్
  • మేరీ కోమ్ పై వ్యాఖ్యలు

ఎంతో వివాదం నడిచిన దరిమిలా నేడు జరిగిన ఒలింపిక్ క్వాలిఫయర్స్ ట్రయల్స్ లో తెలుగు బాక్సర్ నిఖత్ జరీన్ 1-9 తేడాతో సీనియర్ బాక్సర్ మేరీ కోమ్ చేతిలో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ బౌట్ అనంతరం నిఖత్ జరీన్ మీడియాతో మాట్లాడుతూ, మేరీ కోమ్ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. బౌట్ ముగిసిన తర్వాత క్రీడాస్ఫూర్తితో మేరీ కోమ్ ను హత్తుకునేందుకు ప్రయత్నించానని, కానీ మేరీ కోమ్ అందుకు నిరాకరించిందని నిఖత్ ఆరోపించింది. ఓ జూనియర్ బాక్సర్ తో సీనియర్ ఇలా వ్యవహరిస్తుందని ఊహించలేదని పేర్కొంది.

More Telugu News