నిరుద్యోగ మహిళలకు చేయూత... ఉచితంగా బ్యూటీషియన్ కోర్సు

28-12-2019 Sat 18:16
  • దుర్గాబాయ్ దేశ్ ముఖ్ మహిళా సభ నిర్ణయం
  • లిటరసీ హౌస్ సభ్యుల సహకారంతో కోర్సు
  • కోర్సు పూర్తిచేసిన వారికి సర్టిఫికెట్

యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో హైదరాబాదులోని దుర్గాభాయ్ దేశ్ ముఖ్ మహిళా సభ తాజాగా మహిళలకు అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. ఎంతో ఆదరణ ఉన్న బ్యూటీషియన్ రంగంలో మహిళలు ఉపాధి పొందేందుకు వీలుగా లిటరసీ హౌస్ సాయంతో ఉచితంగా బ్యూటీషియన్ కోర్సు అందిస్తోంది. కోర్సును విజయవంతంగా పూర్తిచేసిన వారికి సర్టిఫికెట్ అందజేస్తారు.

బ్యూటీషియన్ కోర్సులో చేరదలిచినవారు డిసెంబరు 30 లోగా తమ పేర్లు నమోదు చేయించుకోవాలి. మొదట వచ్చిన వారికి మొదట ప్రాధాన్యత విధానంలో కోర్సులో సీట్లు కేటాయిస్తారు. వివరాలు తెలుసుకోవాలనుకుంటే 8498080599, 9951210441, 040-27098406 నెంబర్లకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో ఫోన్ చేయాలి.