Visakhapatnam District: విశాఖ వచ్చిన సీఎం జగన్ కు దారిపొడవునా ప్రజల ఘనస్వాగతం

  • విశాఖ ఉత్సవ్ కు హాజరుకానున్న సీఎం జగన్
  • నగరంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం
  • ఎయిర్ పోర్టు నుంచి కైలాసగిరి వరకు జనం నీరాజనం
ఏపీ భావి రాజధానిగా ప్రచారం అందుకుంటున్న విశాఖపట్నం నగరానికి ఏపీ సీఎం జగన్ విచ్చేశారు. విశాఖ ఉత్సవ్ ప్రారంభోత్సవంతో పాటు అనేక అభివృద్ధి పనుల ప్రారంభానికి వచ్చిన ఆయనకు జనం నీరాజనం పలికారు. విశాఖ ఎయిర్ పోర్టు నుంచి కైలాసగిరి వరకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. సుమారు 24 కిలోమీటర్ల వరకు ప్రజలు మానవహారంలా ఏర్పడిన వైనాన్ని సీఎం జగన్ తన కాన్వాయ్ నుంచి వీక్షించారు. అయితే సీఎం జగన్ ఉన్న కారును గుర్తించిన ప్రజలు ఆయనతో సెల్ఫీల కోసం ముందుకు ఉరకడంతో పోలీసులు స్పందించాల్సి వచ్చింది.
Visakhapatnam District
Vizag
Andhra Pradesh
YSRCP
Jagan

More Telugu News