Naga Shaurya: 'అశ్వ‌థ్థామ‌' టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్

  • యాక్షన్ హీరోగా కనిపించిన నాగశౌర్య
  • సొంత బ్యానర్ పై చేస్తున్న సాహసం 
  • కథానాయికగా కనిపించనున్న మెహ్రీన్ 

నాగశౌర్య కథానాయకుడిగా 'అశ్వ‌థ్థామ‌' రూపొందుతోంది. ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాలో మెహ్రీన్ కథానాయికగా నటిస్తోంది. రమణతేజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి నిన్న ఒక టీజర్ ను రిలీజ్ చేశారు. యాక్షన్ సీన్స్ పై కట్ చేసిన ఈ టీజర్, యూ ట్యూబ్ ట్రెండింగులో అగ్రస్థానంలో వుంది.

యూ ట్యూబ్ లో ఒక రేంజ్ లో దూసుకుపోతూ, 24 గంటల్లోనే 4.1 మిలియన్ డిజిటల్ వ్యూస్ ను సాధించింది. ఈ సినిమాలో పోసాని ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. లవర్ బాయ్ గా మంచి ఇమేజ్ వున్న నాగశౌర్య యాక్షన్ హీరోగా భారీ ఫైట్లు చేస్తూ కనిపించడంతో, సహజంగానే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాకి కథను రెడీ చేసింది కూడా నాగశౌర్యనే కావడం మరింత ఆసక్తిని పెంచే అంశం.

More Telugu News