Devineni Uma: 16 నెలలు జైల్లో ఉండొచ్చిన దొంగ నన్ను తిడుతున్నాడు: దేవినేని ఉమ

  • మేనిఫెస్టోలో పెట్టకుండా రాజధానిని ఎలా మారుస్తారు?
  • రాజధానిని ప్రకటించే అధికారాన్ని విజయసాయిరెడ్డికి ఎవరిచ్చారు?
  • విజయసాయిరెడ్డిపై కేసు నమోదు చేయాలి
తప్పుడు పనులు చేసి 16 నెలలు జైల్లో ఉండొచ్చిన వ్యక్తి తనను తిడుతున్నాడంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత దేవినేని ఉమ మండిపడ్డారు. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ లో కీలక వ్యక్తి ఆయన అల్లుడి స్నేహితుడని... ఆయనతో సన్నిహిత సంబంధాలను పెట్టుకుని రాజధానిపై నివేదిక ఇచ్చే పనిని వారికి అప్పగించారని ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పకుండా రాష్ట్ర రాజధానిని మార్చే అధికారాన్ని సీఎం జగన్ కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. విశాఖలో కలెక్టర్, కమిషనర్ పక్కన కూర్చొని రాజధానిని ప్రకటించే అధికారాన్ని విజయసాయిరెడ్డికి ఎవరిచ్చారని అడిగారు. విజయసాయిరెడ్డిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
Devineni Uma
Vijayasai Reddy
Jagan
Telugudesam
YSRCP

More Telugu News