Pooja Hegde: హృతిక్ రోషన్ తో ఆ సీన్ కు సిద్ధమయ్యా.. కానీ, వణుకు పుట్టింది: పూజా హెగ్డే

  • ముద్దు సన్నివేశాలు తెరపై చూడ్డానికి బాగుంటాయి
  • నటించేందుకు మేమెంత కష్టపడతామో ప్రజలకు తెలియదు
  • షూటింగ్ సందర్భంగా మా చుట్టూ ఎంతో మంది ఉంటారు
ఇటు దక్షిణాదితో పాటు అటు బాలీవుడ్ లో కూడా పూజా హెగ్డే బిజీగా ఉంది. ఆమె కాల్షీట్ల కోసం దర్శకనిర్మాతలు కూడా వేచి చూసే పరిస్థితి ఉందంటే ఆమెకున్న డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, అధర చుంబనాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ముద్దు సన్నివేశాలు తెరపై చూడ్డానికి చాలా బాగుంటాయని... కానీ, ఆ సన్నివేశాల్లో నటించేందుకు తాము ఎంత ఇబ్బంది పడతామో ప్రజలకు తెలియదని పూజా హెగ్డే తెలిపింది. 'మొహంజదారో' చిత్రంలో హృతిక్ రోషన్ తో ముద్దు సీన్ ఉందని దర్శకుడు అశుతోష్ గోవారికర్ తనతో చెప్పాడని... అధర చుంబనానికి తాను కూడా సిద్ధమయ్యానని చెప్పింది.

అయితే, అలాంటి సన్నివేశాల్లో తాను అప్పటి వరకు నటించలేదని... దీంతో, తనకు వణుకు పుట్టిందని తెలిపింది. పైగా షూటింగ్ సందర్భంగా తమ చుట్టూ చాలా మంది ఉన్నారని... దీంతో, తనకు చాలా కష్టంగా అనిపించిందని చెప్పింది. ఇలాంటి సన్నివేశాల్లో నటించాలంటే నటీనటుల మధ్య కెమిస్ట్రీ చాలా ముఖ్యమని తెలిపింది. కెమెరా ట్రిక్ లు కూడా ఇలాంటి సన్నివేశాల్లో చాలా ఉపయోగపడతాయని చెప్పింది.
Pooja Hegde
Hrithik Roshan
Bollywood
Tollywood

More Telugu News