Amaravathi: రాజధాని రైతులపై బాబుకు ఉండే కృతజ్ఞత కన్నా వైసీపీ ఎమ్మెల్యేలు మరింత చూపాలి: సబ్బం హరి

  • రైతులపై కృష్ణా, గుంటూరు జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేలు కృతజ్ఞత చూపాలి
  • అలా చేస్తే ఆ రైతుల త్యాగానికి సార్థకత ఉంటుంది
  • సీఎం జగన్ దయచేసి విజ్ఞతతో ఆలోచించాలి
రాజధాని అమరావతి ప్రాంతానికి ఇంత చేసిన చంద్రబాబునాయుడి పార్టీకి మొన్నటి ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేయకుండా జగన్ కు ‘ఒక్క ఛాన్స్’ ఇద్దామని నమ్మి ఓట్లు వేశారని, ఆ విషయాన్ని అక్కడి ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం గ్రహించాలిగా? అని ప్రముఖ రాజకీయవేత్త సబ్బం హరి అన్నారు.

ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబుపై నమ్మకంతో భూములిచ్చిన వారు తమను నమ్మి ఓట్లు వేసి.. ఎమ్మెల్యేను చేశారన్నకృతజ్ఞత వైసీపీ వాళ్లకు ఉండాలని ఆయన సూచించారు. రాజధాని కోసం భూములిచ్చిన అమరావతి ప్రాంత రైతులపై చంద్రబాబుకు ఉండే కృతజ్ఞత కన్నా మరింత కృతజ్ఞతతో కృష్ణా, గుంటూరు జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఉంటే ఆ రైతుల త్యాగానికి సార్థకత ఉంటుందని అభిప్రాయపడ్డారు.

జీఎన్ రావు కమిటీ నివేదికపై నిర్ణయం తీసుకోవాల్సింది కేబినెట్ అని చెప్పడం అంతా ‘బోగస్’ అని, సీఎం జగన్ ఏది చెబితే అదే నిర్ణయం అని అన్నారు. ఈ నిర్ణయం విషయంలో జగన్ దయచేసి విజ్ఞతతో ఆలోచించాలని కోరారు.
Amaravathi
Farmers
poltical analyst
Sabbam hari

More Telugu News