Sensex: దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు

  • 411 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 119 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • కన్జ్యూమర్ డ్యూరబుల్ మినహా అన్ని సూచీలకు లాభాలు

దేశీయ స్టాక్ మార్కెట్లు మూడు రోజుల నష్టాలకు ముగింపు పలికాయి. ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి సూచీలు లాభాల్లోనే పయనించాయి. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ మినహా మిగతా సూచీలన్నీ లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 411 పాయింట్లు ఎగబాకి 41,575కి చేరుకుంది. నిఫ్టీ 119 పాయింట్లు లాభపడి 12,246కి పెరిగింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యాక్సిస్ బ్యాంక్ (3.33%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (2.27%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.24%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.93%), భారతి ఎయిర్ టెల్ (1.89%).

టాప్ లూజర్స్:
కోటక్ మహీంద్రా (-0.42%), ఆల్ట్రాటెక్ సిమెంట్ (-0.22%), టైటాన్ కంపెనీ లిమిటెడ్ (-0.17%), టీసీఎస్ (-0.13%).

More Telugu News