GN Rao: జీఎన్ రావు అంటే లోకువ కావచ్చేమో, నేను లోకువ కాదు కదా: పాత్రికేయులతో పేర్ని నాని

  • మీడియా సమావేశంలో పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు
  • ప్రశ్నల వర్షం కురిపించిన మీడియా ప్రతినిధులు
  • అసహనానికి గురైన మంత్రి!
ఈ రోజు జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో పలు కీలక విషయాలను చర్చించారు. దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మంత్రి పేర్ని నాని ఓ దశలో కాస్తంత అసహనానికి గురయ్యారు. మీడియా ప్రతినిధులు ప్రశ్నలు గుప్పిస్తుండడంతో, "సార్ నేనెక్కడికీ పారిపోను. నేను చెప్పిందే మీరు రాసుకోవాలని పారిపోయే రకం కాదు. మొన్న జీఎన్ రావు మీద దాడి చేసినట్టు నామీద దాడి చేస్తే ఎలా? జీఎన్ రావు అంటే లోకువ కావచ్చేమో కానీ, నేను లోకువ కాదు కదా, నేను మీవాడ్ని, మీరెన్ని ప్రశ్నలు అడిగినా ఓపిగ్గా సమాధానం చెబుతా. మీరు బోరుకొడుతోంది అని వెళ్లిపోయేవరకు నేనిక్కడే ఉంటా" అంటూ బదులిచ్చారు. ఒకరి తర్వాత ఒకరు ప్రశ్నలు అడగాలని, తాను ప్రతి ఒక్కరికీ సమాధానం చెబుతానని స్పష్టం చేశారు.
GN Rao
Andhra Pradesh
YSRCP
Jagan
Amaravathi
Perni Nani

More Telugu News