priest: సిద్ధిపేటలో దారుణం.. ఎనిమిదో తరగతి బాలికతో ఏడాదిగా పూజారి ప్రేమాయణం.. లైంగిక దాడి

  • ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అఘాయిత్యం
  • సన్నిహితంగా గడిపి ఫొటోలు
  • వాట్సప్ గ్రూపుల్లో వైరల్ చేసిన పూజారి 

సిద్ధిపేటలో దారుణ ఘటన వెలుగులోకొచ్చింది. ఓ వైపు గుడిలో పూజలు చేస్తూ, మరోవైపు ఎనిమిదో తరగతి బాలికతో ప్రేమాయణం కొనసాగించాడు ఓ పూజారి. ఏడాదిగా బాలికకు మాయమాటలు చెబుతూ లైంగిక దాడి చేస్తున్నాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పి, సన్నిహితంగా గడిపి, ఇందుకు సంబంధించిన ఫొటోలను తీశాడు.

 చివరకు పూజారి మహేందర్‌ (23)ను పోలీసులు అరెస్టు చేశారు. అతడు ఆ బాలిక ఫొటోలను వాట్సప్‌ గ్రూపుల్లో వైరల్‌ చేశాడని పోలీసులు గుర్తించారు. వాటిని చూసిన ఆ బాలిక తల్లిదండ్రులు తమకు ఫిర్యాదు చేశారని చెప్పారు. అతడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధిత బాలికను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించి, ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

More Telugu News