Sudigali Sudheer: సుధీర్ దూసుకెళతాడని ముందుగానే అనుకున్నాను: గెటప్ శ్రీను

  • సుధీర్ చాలా చురుగ్గా ఉండేవాడు 
  •  బుల్లితెరపై చాలా సందడి చేశాడు 
  • సుధీర్ సక్సెస్ అవుతాడన్న గెటప్ శ్రీను
బుల్లితెర ప్రేక్షకులకు 'గెటప్' శ్రీను గురించి కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. 'జబర్దస్త్' వేదికపై రకరకాల గెటప్ లు వేస్తూ .. ప్రేక్షకులను నవ్విస్తూ ఆయన పాప్యులర్ అయ్యాడు. అలాంటి శ్రీను తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, సుడిగాలి సుధీర్ గురించి ప్రస్తావించాడు.

"నేను .. సుధీర్ బ్యాచిలర్స్ గా వున్నప్పటి నుంచి మంచి స్నేహితులం. మొదటి నుంచి సుధీర్ చాలా చురుగ్గా ఉండేవాడు. ఎప్పటికైనా మంచి యాక్టర్ అవుతాడని అనుకున్నాను .. హీరో అయ్యాడు .. చాలా సంతోషంగా వుంది. బుల్లితెరపై సుధీర్ ఎంతవరకూ చేయాలో అంతవరకూ చేశాడు. ఇక వెండితెరపై తనేంటో చూపించనున్నాడు. బుల్లితెరపై క్లాప్స్ కొట్టే డాన్స్ చేసిన సుధీర్, వెండితెరపై విజిల్ కొట్టే డాన్స్ చేశాడు. అనుకున్నదానికి మించి సుధీర్ సక్సెస్ అవుతాడని భావిస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు.
Sudigali Sudheer
Getup Srinu

More Telugu News