Hasrhakumar: రాజమండ్రిలోని ప్రభుత్వ ఆసుపత్రి ఐసీయూలో హర్షకుమార్‌

  • తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలింపు
  • జ్యుడీషియల్‌ సిబ్బందిపై వ్యాఖ్యలతో అరెస్టు
  • రిమాండ్‌ ఖైదీగా రాజమండ్రి జైలులో ఉన్న మాజీ ఎంపీ
జ్యుడీషియల్‌ సిబ్బందిపై అనుచిత వ్యాఖ్యలు చేసి అరెస్టయిన అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జైలులోనే ఆయనకు సుస్తీ చేయడంతో వెంటనే రాజమండ్రిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో చికిత్స అందిస్తున్నారు.

జ్యుడిషియల్ సిబ్బందిని దూషించినందుకు పోలీసులు ఆయనపై 353,323,506 సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు. అనంతరం రాజమండ్రి 7వ అదనపు కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు. హర్షకుమార్‌కు బెయిల్ నిరాకరించిన న్యాయమూర్తి 14 రోజలు రిమాండ్ విధించారు.

దాంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. జైలులో అస్వస్థతకు గురికావడంతో అధికారులు హుటాహుటిన రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించగా ఐసీయూలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Hasrhakumar
rajamundry
hospitaliged
centra jail

More Telugu News