మాకిచ్చిన గౌరవం ఇది: ప్రత్యేక యూనివర్సిటీ ఏర్పాటుపై ట్రాన్స్ జెండర్లు

27-12-2019 Fri 12:18
  • కిన్నర్ శిక్షా సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో వర్సిటీ 
  • జనవరి 15వ తేదీ నుంచి క్లాసులు మొదలు 
  • దేశంలోనే తొట్టతొలి విశ్వవిద్యాలయం

తమకోసం ప్రత్యేక విశ్వవిద్యాలయం ఏర్పాటుపై ట్రాన్స్ జెండర్లు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. 'ఇన్నాళ్లు సామాజిక వివక్ష ఎదుర్కొంటున్న మాకిచ్చిన గౌరవం ఇది. మేము కూడా చదువుకుని ఉన్నత స్థానాల్లోకి ఎదిగితే అందరిలాగే గౌరవంగా బతకగలుగుతాం' అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోనే తొట్టతొలి ట్రాన్స్ జెండర్ల విశ్వవిద్యాలయం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఖుషీనగర్ జిల్లాలో ఏర్పాటుకానున్న విషయం తెలిసిందే.

అఖిల భారతీయ కిన్నర్ సేవా ట్రస్ట్ (ఏఐటీఈఎసీ) ఆధ్వర్యంలో ఏర్పాటుకానున్న ఈ విశ్వవిద్యాలయంలో వచ్చే జనవరి 15వ తేదీ నుంచి క్లాసులు ప్రారంభం అవుతాయి. ఈ సందర్భంగా ఏఐటీ ఈ ఎన్టీ అధ్యక్షుడు క్రష్ణమోహన్ మిశ్రా మాట్లాడుతూ ప్రత్యేకంగా ట్రాన్స్ జెండర్ల కోసమే ఈ వర్సిటీ ఏర్పాటవుతోంది.

తొలుత ఇద్దరిని చేర్చి జనవరిలో క్లాసులు ప్రారంభిస్తామని, ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ తరగతులు మొదలవుతాయని తెలిపారు. ట్రాన్స్ జెండర్లు బాగా చదువుకుని దేశానికి దిశానిర్దేశం చేసే స్థాయికి ఎదగాలని స్థానిక ఎమ్మెల్యే గంగాసింగ్ కుశ్వాహా ఆశాభావం వ్యక్తం చేశారు.