Vikarabad District: వికారాబాద్ లో దారుణం.. వివాహితపై కిరోసిన్ పోసి నిప్పంటించిన వైనం

  • నియలాల మండలం అగ్గనూరులో ఘటన
  • వివాహేతర సంబంధం కొనసాగించాలని డిమాండ్
  • మహిళపై కిరోసిస్ పోసి అంటించి, తను ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి 
  • ఇద్దరి పరిస్థితి విషమం
వికారాబాద్‌ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనతో వివాహేతర సంబంధం కొనసాగించాలని వివాహిత అంజిలమ్మ(40)ను వేధిస్తోన్న నియలాల మండలం అగ్గనూరు గ్రామ వాసి నర్సింహులు (45) గత రాత్రి 11 గంటలకు ఆమెపై కిరోసిస్ పోసి నిప్పంటించాడు. దీంతో ఆమె తీవ్ర గాయాలపాలైంది. అనంతరం నర్సింహులు కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు.

వారిద్దరికీ తాండూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందుతోందని, వారి పరిస్థితి విషమంగా ఉందని ఈ రోజు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అంజిలమ్మ కుటుంబ సభ్యులపై కూడా నర్సింహులు కిరోసిన్‌ పోసి నిప్పంటించినట్లు తెలుస్తోంది.
Vikarabad District
Crime News

More Telugu News