Vijay Sai Reddy: మరి అమరావతిలో 4 వేల ఎకరాల భూమిని కూడబలుక్కున్నట్లు ఎలా కొంటారు?: విజయసాయి రెడ్డి

  • ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగింది
  • లేకపోతే టీడీపీ నాయకులు, వ్యాపారులు భూములు ఎలా కొంటారు? 
  • 2014 జూన్ లో చంద్రబాబు సీఎం అయ్యారు
  • అమరావతిని క్యాపిటల్ గా ప్రకటించే లోపే భూములు ఎగబడి కొన్నారు

అమరావతిలో గతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ఆరోపిస్తోన్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై విమర్శలు గుప్పించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగకపోతే టీడీపీ నాయకులు, చంద్రబాబు నాయుడు వర్గం రియల్ ఎస్టేట్ వ్యాపారులు నాలుగు వేల ఎకరాల భూమిని కూడబలుక్కున్నట్టు ఎలా కొంటారు? అని ఆయన ప్రశ్నించారు.

 2014 జూన్ లో చంద్రబాబు సీఎం అయ్యారని, అదే ఏడాది డిసెంబర్ లో అమరావతిని క్యాపిటల్ గా ప్రకటించే లోపే ఐదు నెలల్లో భూములు ఎగబడి కొన్నారంటే తెలియడం లేదా? అని విజయసాయిరెడ్డి ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.

More Telugu News