Narendra Modi: 'సార్... మీ ట్వీట్ పై మీమ్స్' అనగానే స్పందించిన ప్రధాని మోదీ!

  • నిన్న సూర్యగ్రహణం
  • పూర్తిగా చూడలేకపోయానన్న ప్రధాని మోదీ
  • నెట్టింట వైరల్ అయిన మీమ్స్

నిన్న మేఘాల కారణంగా తాను సూర్యగ్రహణాన్ని సంపూర్ణంగా చూడలేకపోయానని, ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఓ ఫొటోను కూడా ఆయన పోస్ట్ చేశారు. ఆపై నెట్టింట జోకులు పేలాయి. మీమ్స్ వైరల్ అయ్యాయి.

ప్రతి నెలా తాము జీతాల కోసం ఇలాగే ఎదురు చూస్తున్నామని నెటిజన్లు జోకులు వేశారు. ఇక ఈ విషయాన్ని వివరిస్తూ, ఓ యువకుడు మోదీకి ట్వీట్ చేస్తూ, 'సార్... మీ ఫొటోపై మీమ్స్ తెగ వైరల్ అవుతున్నాయి' అని చెప్పగానే, ఆశ్చర్యకరంగా మోదీ వెంటనే స్పందించారు. 'మోస్ట్ వెల్ కమ్... ఎంజాయ్' అని సమాధానం ఇచ్చారు. ఈ ట్వీట్ మరింత వైరల్ అయింది. తనలోని హాస్య చతురతను బయటపెట్టిన మోదీ 'చాలా కూల్' అంటూ పొగడ్తలు వెల్లువెత్తాయి.

More Telugu News