Chiranjeevi: చిన్న మనవరాలితో చిరంజీవి మురిపెం!

  • శ్రీజ కుమార్తె నవిష్క తొలి పుట్టినరోజు వేడుకలు
  • నవిష్కతో చిరు సందడి
  • ఫొటో పంచుకున్న సుస్మిత
తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి ఎంతో విలువ ఇస్తారు. ప్రస్తుతం ఆయన షూటింగులు లేకపోతే తన మనవరాళ్ల కోసం సమయం కేటాయిస్తున్నారు. తాజాగా, ఏడాది వయసున్న చిన్న మనవరాలితో చిరంజీవి ఫొటో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. డిసెంబరు 25న తొలి పుట్టినరోజు జరుపుకున్న శ్రీజ-కల్యాణ్ దేవ్ ల కుమార్తె నవిష్కను చిరు ఎంతో లాలనగా తన ఒడిలోకి తీసుకున్న దృశ్యం ఆ ఫొటోలో చూడొచ్చు. ఈ పిక్ ను చిరు పెద్ద కుమార్తె సుస్మిత సోషల్ మీడియాలో పంచుకున్నారు.
Chiranjeevi
Srija
Navishka
Susmitha
Tollywood

More Telugu News