హైదరాబాద్ లో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టివేత
- డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను అరెస్టు చేసిన పోలీసులు
- 50గ్రా. హెరాయిన్, 2 కిలోల గంజాయి స్వాధీనం
- న్యూ ఇయర్ పార్టీల కోసం డ్రగ్స్ ను తెచ్చినట్లు వెల్లడి
కీసర, జవహర్ నగర్, కుషాయిగూడ పీఎస్ పరిధిలో ఈ ముఠా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. న్యూ ఇయర్ పార్టీల కోసం డ్రగ్స్ ను ఈ ముఠా హైదరాబాద్ కు తెచ్చినట్లు తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు. రేవ్ పార్టీలు, పబ్ లకు డ్రగ్స్ సరఫరా చేసే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. నిందితులను రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.