Galla Ashok: గల్లా అశోక్ సినిమాలో కీలక పాత్రలో జగపతిబాబు

  • హీరోగా ఎంట్రీ ఇస్తున్న గల్లా జయదేవ్ తనయుడు  
  • శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో చిత్రం
  • రేపటి నుంచి జగపతిబాబుపై సన్నివేశాల చిత్రీకరణ

క్యారక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన జగపతిబాబు పెద్ద తరహా పాత్రల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. తాజాగా ఆయనను మరోసారి కీలకపాత్ర వరించింది. ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రంలో జగపతిబాబు కూడా నటిస్తున్నారు. రేపటినుంచి హైదరాబాద్ లో జరిగే సెకండ్ షెడ్యూల్ లో జగపతిబాబుపై సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. గల్లా అశోక్, నిధి అగర్వాల్ జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. గల్లా జయదేవ్ సొంత ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందిస్తున్నారు.

More Telugu News