పెళ్లికి ముందు డేటింగ్ కోసం ఒకేరోజు ఇద్దరూ ఆహ్వానించారు: రాధికా ఆప్టే

26-12-2019 Thu 17:52
  • అందులో ఒకరు నా భర్త బెనెడిక్ట్ కూడా ఉన్నారు
  • ఎవరితో వెళ్లాలో తొలుత సందిగ్ధంలో పడ్డాను
  • చివరికి నా రూంమేట్ ఇచ్చిన ఉపాయంతో బెనెడిక్ట్ తో డేటింగ్ చేశా

పెళ్లి చేసుకున్నాకే సినిమాల్లోకి వచ్చిన నటి రాధికా ఆప్టే తన అందం, నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంటారు. తాజగా రాధికా ఆప్టే తన పెళ్లికి ముందు జరిగిన డేటింగ్ కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఒకే రోజు ఇద్దరు వ్యక్తులు తనను డేటింగ్ కు ఆహ్వానించారని చెప్పారు.  

‘నేనెప్పుడూ నాకంటే చిన్న వయసు వారితో డేటింగ్ చేయలేదు. ఒక విషయం మాత్రం నిజం. పెళ్లికి ముందు ఒకే రోజు ఇద్దరు అబ్బాయిలు నన్ను డేటింగ్ కు రమ్మన్నారు. వారిలో నా భర్త బెనెడిక్ట్ ఒకరు. ఆ సమయంలో నేను ఏ నిర్ణయం తీసుకోలేకపోయా, నా రూంమేట్ కు విషయం చెప్పడంతో ఓ నిర్ణయానికి వచ్చా. టూనా చేపను వండి మా ఇంటికి వచ్చే పిల్లికి పెట్టాలనుకున్నాం. పిల్లి ఆ వంటకాన్ని తింటే.. బెనెడిక్ట్ తో డేటింగ్ కు వెళ్లాలని.. తినకపోతే మరో కుర్రాడితో డేటింగ్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నా. ఆ పిల్లి చేపను తిన్నది. దీంతో నేను బెనెడిక్ట్ తో డేటింగ్ కి వెళ్లాను. చివరికి ఆయన్నే పెళ్లి చేసుకున్నాను’ అని తెలిపారు.  

సాధారణంగా పెళ్లయ్యాక హీరోయిన్లు కొన్ని సన్నివేశాలకు దూరంగా ఉంటారు.. అయితే రాధికా తీరు విభిన్నం.. మిగతా హీరోయిన్లు చేయలేని సన్నివేశాల్లో నటించారు. కెమెరా ముందు నగ్నంగా కూడా నటించిన సందర్భాలున్నాయి. ఈ విషయంలో తన భర్త బెనెడిక్ట్ టేలర్ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని ఆమె చెబుతున్నారు. తమ మధ్య ఇప్పటివరకు ఎలాంటి విభేదాలు కూడా రాలేదని చెప్పారు.