నాయకత్వంపై ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన అసదుద్దీన్ ఒవైసీ

26-12-2019 Thu 17:33
  • ప్రజల్ని తప్పుదోవ పట్టించేవారు నాయకులు కారన్న రావత్
  • ట్విట్టర్ లో స్పందించిన ఒవైసీ
  • నాయకత్వానికి నిర్వచనం

ప్రజల్ని తిరోగామి పథంలో నడిపించేవాళ్లు నాయకులు కారని, విషం, విద్వేషం దిశగా ప్రజలను, విద్యార్థులను ప్రోత్సహించేది నాయకత్వం అనిపించుకోదని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.

 "ఓ పార్టీ ఏ విధంగా స్పందించాలో, పార్టీ పరిమితులు ఏంటో ఈ నాయకత్వం తెలియజేస్తోంది! ముందు మీరు నాయకత్వం వహిస్తున్న విభాగం సమగ్రతను కాపాడడంపై దృష్టి సారించండి" అంటూ బిపిన్ రావత్ కు పరోక్ష సూచన చేశారు. నాయకత్వం అంటే ప్రజలే రారాజులన్న భావనను అవగాహన చేసుకుని మెలగడమేనని భాష్యం చెప్పారు. ఈ మేరకు అసదుద్దీన్ ట్వీట్ చేశారు.