కీరవాణి, వల్లి గర్వపడాల్సిన క్షణాలివి: కె.రాఘవేంద్రరావు

26-12-2019 Thu 15:51
  • ప్రేక్షకుల ముందుకు వచ్చిన మత్తు వదలరా చిత్రం
  • హీరోగా కీరవాణి తనయుడు శ్రీ సింహ
  • సంగీతం అందించిన మరో తనయుడు కాలభైరవ

ప్రముఖ సంగీతదర్శకుడు ఎంఎం కీరవాణి తనయుడు శ్రీసింహా ప్రధానపాత్రలో వచ్చిన చిత్రం 'మత్తు వదలరా'. రితేష్ రానా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి కీరవాణి మరో తనయుడు కాలభైరవ సంగీతం అందించారు. బుధవారం (డిసెంబరు 25) ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'మత్తు వదలరా' చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. దీనిపై సీనియర్ దర్శకుడు కె.రాఘవేంద్రరావు స్పందించారు. 'మత్తు వదలరా' చిత్రం విజయం సాధించడం పట్ల కీరవాణి గారు, ఆయన అర్ధాంగి వల్లి గారు తప్పకుండా గర్వించాల్సిందేనని ట్వీట్ చేశారు.

'మత్తు వదలరా' చిత్రం ఎంతో ట్రెండీగా ఉందని, సింహా నటన ఆకట్టుకునేలా సాగిందని అభినందించారు. అంతేకాదు, నేపథ్య సంగీతం చాలా గొప్పగా ఉందంటూ సంగీత దర్శకుడు కాలభైరవను ప్రశంసించారు. "ఈ చిత్ర యూనిట్ కు శుభాభినందనలు. భవిష్యత్తులోనూ ఇలాంటి ప్రాజెక్టులు మరెన్నో చేయాలి" అంటూ పేర్కొన్నారు.