సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డిని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో హాజరు పరిచిన పోలీసులు

26-12-2019 Thu 12:47
  • వాంగ్మూలం నమోదు చేసిన న్యాయమూర్తి 
  • హాజీపూర్ వరుస కిల్లర్ గా కేసు నమోదు 
  • జనవరిలో ఈ కేసు తీర్పు వచ్చే అవకాశం

సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డిని పోలీసులు ఈరోజు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో హాజరు పరిచారు. హాజీపూర్ వరుస హత్యల్లో శ్రీనివాసరెడ్డి నిందితుడు. అమ్మాయిలపై అత్యాచారం చేసి అనంతరం హత్యచేసి గుట్టుచప్పుడు కాకుండా శవాలు మాయం చేసినట్లు వెలుగు చూడడం గతంలో సంచలనమైంది.  

దీంతో ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసింది. ఈ కోర్టుకు నిందితుడిని హాజరు పరచగా సెక్షన్ 313 కింద న్యాయమూర్తి వాంగ్మూలం నమోదు చేశారు. ఆ తర్వాత ఇరువర్గాల న్యాయవాదుల వాదనలు కోర్టు వింటుంది. ఈ కేసుకు సంబంధించిన తీర్పు జనవరిలో వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.