టీడీపీ నేత బుద్ధా వెంకన్న గృహ నిర్బంధం

26-12-2019 Thu 10:57
  • మందడంలో రైతులు, మహిళలు దీక్ష 
  • కృష్ణాయపాలెంలో రైతులు వినూత్న రీతిలో నిరసన
  • సచివాలయానికి వెళ్లే ఉద్యోగులకు పూలు  

అమరావతిలో ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అమరావతి నుంచి రాజధానిని తరలించవద్దంటూ ఆ ప్రాంత రైతులు దీక్షలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి సంఘీభావం తెలిపేందుకు సిద్ధమవుతోన్న టీడీపీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేస్తున్నారు.

అమరావతిలోని మందడంలో రైతులు, మహిళలు దీక్ష కొనసాగిస్తున్నారు. గుంటూరులోని మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో రైతులు వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు. సచివాలయానికి వెళ్లే ఉద్యోగులకు పూలు ఇస్తున్నారు.  వైసీపీ నేతలు తమ దీక్షా శిబిరాలకు వచ్చి తాము చెప్పేది వినాలని రైతులు కోరుతున్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.