Raveena Tandon: చిక్కుల్లో బాలీవుడ్ దర్శకురాలు ఫరాఖాన్, భారతీసింగ్, రవీనాటాండన్

  • యూట్యూబ్ చానల్‌ కోసం వీడియో
  • తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు
  • చర్యలు తీసుకోవాలని డిమాండ్
బాలీవుడ్ మహిళా డైరెక్టర్ ఫరాఖాన్, మహిళా నటులు భారతీ సింగ్, రవీనాటాండన్‌లపై అమృత్‌సర్‌లో కేసు నమోదైంది. ముగ్గురూ కలిసి ఓ ప్రైవేట్ వెబ్, యూట్యూబ్ చానల్ కోసం రూపొందించిన కామెడీ ప్రోగ్రాం తీవ్ర వివాదాస్పదమైంది. ఇందులో ఓ మతం మనోభావాలను దెబ్బతీసినట్టు వీరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అమృత్‌సర్‌లోని అజ్నాల్‌కు చెందిన క్రైస్తవులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ మనోభావాలను దెబ్బతీసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతకుముందు ఫరాఖాన్, భారతీసింగ్, రవీనాలకు వ్యతిరేకంగా ప్రదర్శన నిర్వహించారు. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Raveena Tandon
farah khan
Bharati singh

More Telugu News