Nellore District: వివాహితను వేధిస్తున్న ఆటో డ్రైవర్.. ఆటోకి నిప్పు పెట్టిన మహిళ

  • నెల్లూరు జిల్లాలోని గుంపర్లపాడులో ఘటన
  • నిప్పు పెట్టి కోపం తీర్చుకున్న వివాహిత
  • పోలీసులను ఆశ్రయించిన ఆటో డ్రైవర్
తనను వేధిస్తున్న ఆటో డ్రైవర్‌కు బుద్ధి చెప్పిందో వివాహిత. అతడి ఆటోకి నిప్పు పెట్టి తన కోపాన్ని తీర్చుకుంది. నెల్లూరు జిల్లాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. ఏఎస్‌పేట మండలం గుంపర్లపాడుకు చెందిన బాదుల్లా గ్రామానికే చెందిన వివాహితను తరచూ వేధిస్తున్నాడు. హెచ్చరించినా తీరు మార్చుకోకపోవడంతో బుద్ధి చెప్పాలని భావించిన వివాహిత అతడి ఆటోకు నిప్పు పెట్టింది. దగ్ధమైన ఆటోను చూసి లబోదిబోమన్న బాదుల్లా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కావాలనే ఆమె తన ఆటోకి నిప్పు పెట్టినట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Nellore District
Auto driver
woman

More Telugu News