Karem Shivaji: మూడు రాజధానుల అంశంపై పవన్ కు అవగాహన లేదు: కారెం శివాజీ

  • చిరంజీవి స్వాగతిస్తే.. అతని సోదరుడు పవన్‌ కల్యాణ్‌ వ్యతిరేకిస్తున్నారు
  • ప్రజల మద్దతు లేని పార్టీ జనసేన అని విమర్శ
  • త్వరలోనే జనసేన పార్టీ మూతపడుతుంది
మూడు రాజధానుల విషయంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు అవగాహన లేదని ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ కారెం శివాజీ పేర్కొన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మూడు రాజధానుల ప్రతిపాదనపై వస్తోన్న నిరసనపై స్పందించారు. మూడు రాజధానుల ప్రతిపాదనను చిరంజీవి స్వాగతిస్తే.. అతని సోదరుడు పవన్‌ కల్యాణ్‌ వ్యతిరేకిస్తున్నారన్నారు. ప్రజల మద్దతు లేని పార్టీ జనసేన అని కారెం విమర్శించారు. త్వరలోనే  జనసేన పార్టీ మూతపడుతుందని జోస్యం చెప్పారు.
Karem Shivaji
comments on janasena party
Andhra Pradesh

More Telugu News