Allu Arjun: 'ప్రతిరోజూ పండగే' సూపర్ హిట్ నేపథ్యంలో.. సాయితేజ్‌ను అభినందించిన అల్లు అర్జున్

  • ఈ చిత్రంతో సాయితేజ్‌ హిట్‌ అందుకున్నాడు
  • నా స్నేహితుడు మారుతి విజయం సాధించారు
  • నాకు సంతోషంగా ఉంది

మారుతి దర్శకత్వంలో సాయితేజ్ హీరోగా వచ్చిన సినిమా 'ప్రతిరోజూ పండగే'కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. దీంతో స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తన సోదరుడు సాయితేజ్‌ను, ఆ సినిమా బృందాన్ని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ప్రతిరోజూ పండగే సినీ బృందానికి అభినందనలని చెప్పారు.

ఈ చిత్రంతో సాయి తేజ్‌ హిట్‌ అందుకున్నందుకు, తన స్నేహితుడు మారుతి విజయం సాధించినందుకు తనకు సంతోషంగా ఉందని అల్లు అర్జున్ అన్నారు. బన్నీ వాసు ఓ మంచి సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడని, తన తండ్రి మంచి వసూళ్లను రాబట్టుకున్నందుకు హర్షం వ్యక్తం చేస్తున్నానని పేర్కొన్నారు. యూవీ ఫిల్మ్స్‌కు అభినందనలు తెలుపుతున్నానని, ఈ సినిమాతో మరో మంచి ఆల్బమ్‌ను అందించిన తమన్‌కు అభినందనలని ఆయన ట్వీట్ చేశారు.

More Telugu News