amaravati: అభివృద్ధి వికేంద్రీకరణను స్వాగతిస్తాం: కన్నా లక్ష్మీ నారాయణ

  • రైతుల మహాధర్నాకు సంఘీభావం తెలిపిన కన్నా
  • రాజధానిని తరలించాలనే ఆలోచన మంచిది కాదు
  • అధికారంలో ఉన్న వారు ప్రజల అభివృద్ధిని కాంక్షించాలి
రాజధాని మారుతుందన్న వార్తల నేపథ్యంలో అమరావతి రైతుల ఆందోళన కొనసాగుతోంది. గుంటూరు జిల్లా తుళ్లూరులో రైతులు, మహిళలు మహా ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో అనంతవరం, బోరుపాలెం, దొండపాడు వాసులు పాల్గొన్నారు. వారి ఆందోళనకు బీజేపీ నేతలు మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. మహాధర్నాకు సంఘీభావం తెలుపుతున్నట్లు చెప్పారు. రాజధానిని తరలించాలనే ఆలోచన మంచిది కాదని ఆయన అన్నారు. అధికారంలో ఉన్న వారు ప్రజల అభివృద్ధిని కాంక్షించాలని ఆయన వైసీపీని డిమాండ్ చేశారు. రైతు సమస్యలతో పాటు రాజధాని కోసం బీజేపీ పోరాడుతోందని భరోసా ఇచ్చారు. తాము అభివృద్ధి వికేంద్రీకరణను మాత్రం స్వాగతిస్తామని చెప్పారు.
amaravati
laxmi narayana
BJP

More Telugu News