judicial capital: జ్యుడీషియల్ రాజధానిపై రెండు వర్గాలుగా విడిపోయిన హైకోర్టు న్యాయవాదులు

  • ప్రభుత్వానికి అనుకూల, వ్యతిరేకంగా నినాదాలు
  • ఏపీ హైకోర్టు జనరల్ బాడీ సమావేశంలో రసాభాస 
  • కర్నూలు తరలింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం

కర్నూలును జ్యుడీషియల్ రాజధానిగా ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై అమరావతిలోని న్యాయవాదులు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు ప్రభుత్వానికి అనుకూలంగా, మరికొందరు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ రోజు జరిగిన హైకోర్టు జనరల్ బాడీ సమావేశంలో ఇరువర్గాలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో సమావేశం ఆసాంతం రసాభాసగా మారింది. హైకోర్టు తరలింపును వ్యతిరేకిస్తూ ఇప్పటికే బెజవాడ బార్ అసోసియేషన్ ఆందోళనలు చేస్తోంది.

ఈ నేపథ్యంలో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో పీపీలతోపాటు ఓ వర్గం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. దీన్ని మరో వర్గం న్యాయవాదులు వ్యతిరేకించారు. దీంతో ఇరువర్గాలు పోటాపోటీగా ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక నినాదాలు చేశారు. పర్యవసానంగా కాసేపు సమావేశం రసాభాసగా మారింది.

దాదాపు గంటపాటు జరిగిన సమావేశంలో ఎట్టకేలకు ఓ అవగాహనకు వచ్చి కర్నూలులో హైకోర్టు ఏర్పాటును వ్యతిరేకిస్తూ హైకోర్టు బార్ అసోసియేషన్ తీర్మానం చేసింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈనెల 26, 27 తేదీల్లో విధులు బహిష్కరించాలని నిర్ణయించారు.

More Telugu News