మీ కోరిక చెప్పండి... కొన్నయినా కచ్చితంగా తీరుస్తా: ఫ్యాన్స్ కు విజయ్ దేవరకొండ బంపరాఫర్

25-12-2019 Wed 11:49
  • రెండేళ్లుగా 'దేవరాశాంటా' నిర్వహిస్తున్న విజయ్
  • ఈ సంవత్సరం మరికాస్త ప్రత్యేకంగా ప్రోగ్రామ్
  • అభిమానులను ఏం కావాలో అడిగిన స్టార్ హీరో

'అర్జున్ రెడ్డి' చిత్రంతో యూత్ లో స్టార్ హీరో అయిపోయిన విజయ్ దేవరకొండ, 2017లో తాను ప్రకటించిన 'దేవరాశాంటా' కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా ప్రకటించారు. ఇందులో భాగంగా, గత రెండేళ్లలో కొంతమందికి స్పెషల్ బహుమతులను అందించిన విజయ్, ఈ సంవత్సరం మరికాస్త ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్ ను జరపనున్నట్టు చెప్పారు.

ఈ మేరకు ఓ వీడియోను పోస్ట్ చేస్తూ, ఎవరికి ఏం కావాలో చెబితే, అందిస్తానని అన్నారు.
తాను నిజమే చెబుతున్నానని, కనీసం తొమ్మిది, పదిమంది కోరికలనైనా తీరుస్తానని అన్నారు. వీలైనంత ఎక్కువ మందికి బహుమతులు పంపుతానని చెప్పారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను పెట్టారు. ఇక ఈ వీడియోను చూసిన అభిమానులంతా, తమ కోరికల చిట్టాను విజయ్ ముందు విప్పుతున్నారు. మరిక వాటిల్లో ఎన్ని తీరుతాయో వేచి చూడాలి.