Asaduddin Owaisi: అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలో కేసీఆర్ ను కలవనున్న యునైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ

  • సీఏఏ, ఎన్‌ఆర్‌సీపై మండిపడుతోన్న అసదుద్దీన్ ఒవైసీ 
  • యునైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీతో చర్చలు
  • భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం?

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ)పై మండిపడుతోన్న అసదుద్దీన్ ఒవైసీ కాసేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవనున్నారు. ఆయన పాటు యునైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ కూడా కేసీఆర్ ను కలిసి ఈ అంశాలతో పాటు పలు విషయాలపై చర్చించనుంది. యునైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీతో హైదరాబాద్ లోని తన నివాసంలో అసదుద్దీన్ ఒవైసీ ఇటీవలే చర్చలు జరిపారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీలపై తమ భవిష్యత్ కార్యాచరణపై యునైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారు కేసీఆర్ ను కలిసి పలు అంశాలను వివరించనున్నారు.

More Telugu News