Spain: పిల్లలకు మరింత బాగా పాఠం చెప్పాలని... అనాటమీ సూట్ తో వచ్చిన టీచర్... వైరల్ వీడియో ఇదిగో!

  • శరీరంలోని భాగాలను చూపించేలా సూట్
  • స్పెయిన్ టీచర్ వినూత్న ప్రయత్నం
  • అభినందిస్తున్న లక్షల మంది
ఆమె పేరు వెరోనికా. స్పెయిన్ లోని ఓ పాఠశాలలో గత 15 సంవత్సరాలుగా అనాటమీ బోధిస్తున్నారు. తన విద్యార్థులకు మరింతగా అర్థమయ్యేలా పాఠాలు చెప్పాలని భావించిన ఆమె, ఓ స్పెషల్ సూట్ ను తయారు చేయించుకుని, దాన్ని వేసుకుని క్లాస్ కు వచ్చి, 3వ తరగతి చదువుతున్న విద్యార్థులకు శరీరంలోని భాగాలను చూపించిన తీరు ఇప్పుడు వైరల్ అవుతోంది. 43 ఏళ్ల వెరోనికా, ఓ వినూత్న పద్ధతిలో చెప్పిన పాఠాల వీడియోను లక్షల మంది చూసి, ఆమె ప్రయత్నాన్ని అభినందిస్తున్నారు.

మానవ అంతర్గత అవయవాలు ముద్రితమై ఉన్న సూట్ తో వచ్చిన ఆమె, చిన్న వయసు పిల్లలు అవయవాలను ఊహించుకోవడం కష్టమని, అందువల్లే తాను ఇలా వచ్చి, శరీర భాగాలను వాళ్లకు చూపించానని చెప్పారు. తరగతి గదిలో వెరోనికా భర్త వీడియోను తీసి సోషల్ మీడియాలో ఉంచారు. ఆమె వీడియోకు లక్షల కొద్దీ లైక్స్, వేల కొద్దీ రీ ట్వీట్స్ వస్తున్నాయి. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.
Spain
Anotomy
Suite
Veronica
Viral Videos

More Telugu News