నేడంతా పులివెందులలోనే ఉండనున్న వైఎస్ జగన్!

25-12-2019 Wed 08:44
  • నేడు సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు
  • పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
  • పూర్తయిన భవనాలకు ప్రారంభోత్సవాలు

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్, తన కడప జిల్లా పర్యటనలో భాగంగా, మూడో రోజున సొంత నియోజకవర్గమైన పులివెందులలోనే గడపనున్నారు. గత రాత్రే ఇంటికి చేరుకున్న ఆయన, తనను కలిసేందుకు వచ్చిన స్థానిక నేతలను పలకరించారు. మరికాసేపట్లో ఆయన పట్టణంలోని సీఎస్ఐ చర్చికి వెళ్లి, అక్కడ జరిగే క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి జగన్ కుటుంబీకులంతా హాజరవుతారు. ఆపై పులివెందులలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేయనున్నారు. పూర్తయిన భవనాలకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు.