చిన్నారులతో కలిసి 'వెంకీమామ' సందడి... వీడియో ఇదిగో!

25-12-2019 Wed 08:25
  • బాక్సాఫీస్ వద్ద దూసుకెళుతున్న 'వెంకీమామ'
  • అనాధ బాలల కోసం ప్రత్యేక ప్రదర్శన
  • స్వయంగా హాజరైన విక్టరీ వెంకటేశ్

విక్టరీ వెంకటేశ్ నటించిన తాజా చిత్రం 'వెంకీమామ' బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న వేళ, అనాధ బాలల కోసం చిత్రాన్ని ఐనాక్స్ లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి స్వయంగా హాజరైన వెంకటేశ్, పిల్లలతో కలిసి కాసేపు సరదాగా సందడి చేశారు. వారిని పలకరిస్తూ, సెల్ఫీలు ఇస్తూ కనిపించారు. పిల్లలు తమ స్కూలుకు రావాలని కోరగా, తప్పకుండా వస్తానని చెప్పారు. ఇక్కడున్న పిల్లలంతా ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలవాలని కోరుకున్నారు. ప్రతి ఒక్కరూ జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలని సలహా ఇచ్చారు. ఈ సందర్భంగా పిల్లలకు చిన్న చిన్న బహుమతులనూ ఆయన అందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను మీరూ చూడవచ్చు.