రెచ్చగొట్టే ప్రసంగాలు.. సోనియా, ప్రియాంక, ఒవైసీలపై ఫిర్యాదు నమోదు

24-12-2019 Tue 22:03
  • పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ప్రసంగాలు
  • యూపీలోని కోర్టులో న్యాయవాది ప్రదీప్ గుప్తా పిటిషన్
  • వచ్చే నెల 24వ తేదీకి విచారణ వాయిదా 

నిన్న ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సత్యాగ్రహ దీక్షలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీపై ఫిర్యాదు నమోదైంది. ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో న్యాయవాది ప్రదీప్ గుప్తా ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. ఇవే ఆరోపణలు చేస్తూ ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, జర్నలిస్టు రవీష్ కుమార్ ల పైనా ఆయన ఫిర్యాదు చేశారు. ఈ పిటిషన్ పై విచారణను వచ్చే నెల 24వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు న్యాయస్థానం తెలిపింది.