Hyderabad: ఎంఎంటీఎస్ రైలు ఢీ కొట్టడంతో.. కాబోయే దంపతుల మృతి

  • హైదరాబాద్, చందానగర్ లో విషాద ఘటన
  • చందానగర్ లో షాపింగ్ కు వెళ్లే క్రమంలో దుర్ఘటన
  • ఫిబ్రవరిలో వీరి వివాహం జరగాల్సి ఉంది
హైదరాబాద్ శివారు చందానగర్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. రైలు పట్టాలు దాటుతుండగా ఎంఎంటీఎస్ రైలు ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.
చందానగర్ లో షాపింగ్ కు మనోహర్, సోనీలు వెళ్తున్న క్రమంలో ఈ విషాద ఘటన జరిగింది. కొన్ని రోజుల క్రితమే మనోహర్, సోనీల నిశ్చితార్థం జరిగింది. ఫిబ్రవరిలో వీరి పెళ్లి జరగాల్సి ఉన్నట్టు సమాచారం.
Hyderabad
MMTS
chandanagar
accident

More Telugu News