గురజాలలో అక్రమ మైనింగ్ కేసులు సీబీఐకి అప్పగింత

24-12-2019 Tue 15:05
  • జీవో జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
  • ఈ జీవోలో యరపతినేనితో పాటు మరో 18 మంది పేర్లు
  • కోనంకి, కేతనపల్లి, నడికుడి గ్రామాల్లో అక్రమ మైనింగ్ కేసులు

ఏపీలోని గురజాలలో అక్రమ మైనింగ్ కేసులను సీబీఐకి అప్పగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. మాజీ ఎమ్మెల్యే యరపతినేనితో పాటు మరో 18 మంది పేర్లను ఈ జీవోలో పేర్కొన్నారు. కోనంకి, కేతనపల్లి, నడికుడి గ్రామాల్లో అక్రమ మైనింగ్ పై 18 కేసులు నమోదయ్యాయి. కాగా, అక్రమ మైనింగ్ వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే డీజీవీ కృష్ణారెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ కేసులపై దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తామని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది.