డాన్స్ చేయడంలో ఆ ముగ్గురి తరువాతే ఎవరైనా: సాయితేజ్

24-12-2019 Tue 14:49
  • మొదటి నుంచి నాకు డాన్స్ అంటే ఇష్టం 
  • చిరంజీవి గారు గొప్ప డాన్సర్
  • ఆ ముగ్గురి ప్రత్యేకత అదే

తొలి సినిమాతోనే మాస్ ఆడియన్స్ ను మెప్పించిన హీరోల జాబితాలో సాయితేజ్ కనిపిస్తాడు. చాలా తక్కువ సమయంలో ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకున్న ఆయన, 'ప్రతిరోజూ పండగే' సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, "మొదటి నుంచి కూడా నాకు డాన్స్ అంటే ఇష్టం. తెలుగు సినిమాకి సంబంధించి డాన్సులలో చిరంజీవిగారి తరువాతే ఎవరైనా. ఆయన కాకుండా అంటే .. ఎన్టీఆర్ .. రామ్ చరణ్ ..అల్లు అర్జున్ ఈ ముగ్గురూ కూడా డాన్సులతో అదరగొట్టేస్తారు. ఎన్టీఆర్ డాన్స్ లకు క్లాసికల్ టచ్ ఎక్కువగా ఉంటుంది ..  డిఫరెంట్ స్టెప్స్ తో బన్నీ ఆశ్చర్యపరుస్తాడు. చరణ్ డాన్స్ చాలా గ్రేస్ ఫుల్ గా ఉంటుంది. నా దృష్టిలో ఈ ముగ్గురూ బెస్ట్ డాన్సర్స్" అని చెప్పుకొచ్చాడు.