మూడు రాజధానుల అంశంపై ప్రతిపక్షాలతో టీడీపీ కీలక భేటీ

24-12-2019 Tue 13:01
  • గుంటూరులో సమావేశం
  • పాల్గొన్న జనసేన, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌ నేతలు
  • హాజరైన టీడీపీ నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు 

రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండవచ్చంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలపై అమరావతి రైతులు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడు రాజధానుల అంశంపై చర్చించేందుకు గుంటూరులో టీడీపీ ఆధ్వర్యంలో అఖిలపక్ష భేటీ జరుగుతోంది. జనసేన, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌ తో పాటు ప్రజాసంఘాల ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొంటున్నారు.

టీడీపీ నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబుతో పాటు పలువురు నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. జనసేన నుంచి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, కమతం సాంబశివరావు పాల్గొంటున్నారు. అలాగే, కాంగ్రెస్, వామపక్ష పార్టీల తరఫున ఆయా పార్టీల నేతలు హాజరయ్యారు.