Dil Raju: 'రౌడీ బాయ్స్' టైటిల్ ను ఖరారు చేసిన దిల్ రాజు

  • 'దిల్' రాజు ఇంటి నుంచి హీరోగా ఆశిశ్ రెడ్డి 
  • ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి 
  • జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్  

నిర్మాతగా 'దిల్' రాజు వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నారు. ఆయన బ్యానర్లో ఒక్క సినిమా చేసినా చాలు అని యంగ్ హీరోలు అనుకుంటూ వుంటారు. అలాంటి 'దిల్' రాజు .. ఈ సారి తన బ్యానర్ నుంచి ఒక కొత్త హీరోను పరిచయం చేయనున్నాడు. ఆ హీరో ఎవరో కాదు .. 'దిల్' రాజు సోదరుడు శిరీశ్ రెడ్డి తనయుడు ఆశిశ్ రెడ్డి.

కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాకి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఇప్పుడు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను .. స్క్రిప్ట్ పనులను పూర్తిచేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి 'రౌడీ బాయ్స్' అనే టైటిల్ ను ఖరారు చేస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడనుందని చెబుతున్నారు. 'హుషారు' ఫేమ్ శ్రీహర్ష ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

More Telugu News