Venkaiah Naidu: అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉంది: వెంకయ్య నాయుడు

  • పట్టణాల నుంచి గ్రామస్థాయి వరకు అభివృద్ధి జరగాలి
  • రాబోయే రోజుల్లో నీళ్ల కోసం పోరాడే పరిస్థితి
  • వ్యవసాయంపై అందరూ దృష్టి పెట్టాలి
  • భావి ఇంజనీర్లు దేశ ప్రజల అభివృద్ధికి పాటుపడాలి

అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందని, పట్టణాల నుంచి గ్రామస్థాయి వరకు అభివృద్ధి జరగాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం నిట్ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా ప్రసంగించారు. రాబోయే రోజుల్లో నీళ్ల కోసం పోరాడే పరిస్థితి వస్తుందని అన్నారు. వ్యవసాయంపై అందరూ దృష్టి పెట్టాలని,  మేధాశక్తితో భావి ఇంజనీర్లు దేశ ప్రజల అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు.

ఆహార ఉత్పత్తిని మరింత పెంచాల్సిన అవసరముందని, వనరులను సద్వినియోగం చేసుకోవడమే మన పనని వెంకయ్య నాయుడు చెప్పారు. కల్తీలేని విద్యుత్ అందించేలా పరిశోధనలు చేయాలని, పరిశ్రమలతో పాటు పరిశుభ్రమైన వాతావరణం అవసరమని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆదర్శంగా ఉండేలా మనిషి జీవించాలని ఆయన పిలుపునిచ్చారు.

More Telugu News